తెరాస ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఏలాంటి ప్రయోజనం చేకూరలేదని రంగారెడ్డి-హైదరాబాద్- మహబూబ్‌నగర్ మండలి పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులను, పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం అంబర్‌పేట్‌లోని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావు ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తలతో చిన్నారెడ్డి సమావేశమయ్యారు.
ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు: చిన్నారెడ్డి
ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు, పీఆర్సీ విషయంలో ఉద్యోగులను తెరాస మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. పట్టభద్రులకు కేంద్రంలోని భాజపా ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు. ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్‌కే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.
ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు: చిన్నారెడ్డి
పట్టభద్రులకు కేంద్రంలోని భాజపా ఎలాంటి న్యాయం చేయలేదని వారు ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేధావులు, విద్యావంతులు ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని కోరారు. గెలిచిన మరుక్షణమే అన్ని సమస్యలపై పోరాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి:ఉద్యోగ హామీలను సీఎం కేసీఆర్, పీఎం మోదీ మర్చిపోయారు: సీతక్క