మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 5న భూ సంస్కరణలపై సెమినార్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ గౌరవ అధ్యక్షులు వి.హన్మంతరావు, కన్వీనర్ మహేష్ గౌడ్... గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పీవీకి అత్యంత ఇష్టమైన భూ సంస్కరణల మీద ఇప్పటి వరకు రెండు సెమినార్లు ఘనంగా నిర్వహించామని తెలిపారు. అక్టోబరు 5న ఇందిరా భవన్‌లో జరగబోయే మూడో సెమినార్‌లో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, పీవీతో అనుబంధం ఉన్న ప్రముఖులు జూమ్ యాప్ ద్వారా పాల్గొంటారని పేర్కొన్నారు.
అక్టోబర్ 5న భూసంస్కరణలపై సెమినార్ : వీహెచ్ - వీహెచ్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 5న భూసంస్కరణలపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ గౌరవ అధ్యక్షుడు వి.హన్మంతరావు, కన్వీనర్ మహేశ్‌గౌడ్ తెలిపారు. పీవీ నరసింహారావుకు అత్యంత ఇష్టమైన భూసంస్కరణలపై నిర్వహిస్తున్న సెమినార్‌లో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, పీవీతో అనుబంధం ఉన్న ప్రముఖులు పాల్గొంటారని వివరించారు.
![అక్టోబర్ 5న భూసంస్కరణలపై సెమినార్ : వీహెచ్ v hanumanth rao announcement on land reforms seminar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8983497-244-8983497-1601381073534.jpg)
అక్టోబర్ 5న భూసంస్కరణలపై సెమినార్ : వి. హనుమంతరావు
కీసరలో పేదలకు చెందిన 94 ఎకరాలు భూమి తిరిగి వారికే చెందినప్పుడే.. పీవీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేసినట్లవుతుందని వీహెచ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్ కూడా ఈ సెమినార్‌లో నేరుగా పాల్గొంటే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు.
అక్టోబర్ 5న భూసంస్కరణలపై సెమినార్ : వి. హనుమంతరావు