తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్ గాంధీ కోసం మహా చండీ యాగం చేస్తున్న వీహెచ్ - తెలంగాణ వార్తలు

కరోనా బారిన పడిన కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్​తో పాటు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మహా చండీ యాగం చేపట్టారు. మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరి క్షేమం కోసం ఈ యాగం చేస్తున్నట్లు వీహెచ్ తెలిపారు.

V Hanmantharao undertakes Maha Chandi Yagam, V Hanmantharao latest news
రాహుల్ గాంధీకోసం మహా చండీయాగం చేపట్టిన వీహెచ్, వీ హనుమంతరావు

By

Published : Apr 24, 2021, 5:13 PM IST

కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​తో పాటు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మహా చండీ యాగం చేపట్టారు. హైదరాబాద్​లోని అంబర్​పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు.

సోనియా గాంధీ ఆరోగ్యం కోసం గతంలో యాగం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని వీహెచ్ అన్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్నవారి ఆరోగ్యం మెరుగుపడాలని ఈ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details