మెగాస్టార్ నటిస్తున్న సైరా సినిమా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర కాదని దర్శకుడు సురేందర్‌రెడ్డి హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 26న గురువారం హైకోర్టులో ఉయ్యాలవాడ వారసులు వేసిన పిటిషన్‌పై జరిగిన విచారణపై స్పందించారు. సైరా చిత్రం... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్నామని చిరంజీవి, రాంచరణ్ చెప్పినట్లు గుర్తుచేశారు. ఉయ్యాలవాడ వారసులతో ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. ఉయ్యాలవాడ వారసులకు సైరా సినిమాను విడుదలకు ముందే చూపించాలని కోరారు. వారి కుంటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకుంటామని సినిమా నిర్మాత రాంచరణ్ హామీ ఇచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. ఒప్పందం ప్రకారం ఏడు కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ఉయ్యాలవాడ వారసులు కోరారు.
"ఉయ్యాలవాడ కుటుంబాన్ని చిరంజీవి, రాంచరణ్ మోసగిస్తున్నారు" - చిరంజీవి సైరా కేసు విషయం
ఉయ్యాలవాడ కుటుంబాన్ని నటుడు చిరంజీవి, నిర్మాత రాంచరణ్ మోసగిస్తున్నారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సౌత్ ఇండియా సేవాసమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
UYYALAVADA FAMILIES ALLEGATIONS ABOUT CHIRANJEEVI SYRAA MOVIE