తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభ సభ్యత్వానికి ఉత్తమ్​ రాజీనామా, ఆమోదం - ఉత్తమ్​కుమార్​రెడ్డి రాజీనామా

హుజూర్​నగర్​ ఎమ్మెల్యే పదవికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు నోటిఫికేషన్ జారీ అయింది. శాసనసభలో హుజూర్​నగర్​ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు.

ఉత్తమ్​ రాజీనామా

By

Published : Jun 5, 2019, 7:17 PM IST

Updated : Jun 5, 2019, 9:35 PM IST

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్​కుమార్​ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హుజూర్​నగర్​ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందచేశారు. నల్గొండ లోక్​సభ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. రెండు పదవుల్లో ఒకదానిని వదులుకోవాల్సి ఉన్నందున ఎమ్మెల్యే పదవిని త్యజించారు. ఇవాళ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డితో మాట్లాడిన ఉత్తమ్‌ రాజీనామా నిర్ణయాన్ని తెలియచేశారు. ఇవాళ రంజాన్‌ సెలవురోజైనా ... అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు లేఖను ఇవ్వాలని పోచారం ఉత్తమ్​కు సూచించారు. సాయంత్రం రాజీనామా ఆమోదించినట్లు నోటిఫికేషన్ జారీ అయింది.

Last Updated : Jun 5, 2019, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details