కాంగ్రెస్ ఎంపీ వసంత కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి పార్లమెంట్ సభ్యులు వసంత కుమార్ కరోనా బారిన పడి మృతి చెందారు.
దేశంలో కరోనా రోజు రోజుకూ విజృంభిస్తుందని.. ఒక ఎంపీ కూడా మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వసంత్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో క్రమశిక్షణ కలిగిన నేత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను సంపూర్ణాంగా ఆచరించే నేత అని కొనియాడారు. వసంతకుమార్ కుటుంబం మొత్తం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే క్రియాశీలకంగా పని చేశారని అన్నారు.