కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజకీయ కారణాలతో వెళ్లేవారిని ఆపగలం కానీ, ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారిని ఎలా ఆపగలం అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి విషయంలో ఏఐసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు లేవన్నారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడలేదన్నారు. భాజపాను పొగడటానికే ప్రసంగం సరిపోయిందని ఉత్తమ్ఎద్దేవాచేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందన - rajagopal reddy
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆర్థిక కారణాలతో వెళ్లే వారిని ఎలా ఆపగలం అని ప్రశ్నించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి
Last Updated : Jun 20, 2019, 4:12 PM IST