మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 30న దిల్లీలో భారత్ బచావ్ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ వార్ రూమ్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం.. పెరుగుతున్న నిరుద్యోగం, రైతు సమస్యలపై ఆందోళనలు ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భారత్ బచావ్ ఆందోళన కార్యక్రమానికి తెలంగాణ నుంచి 1,200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
'ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది కార్యకర్తలు' - నవంబర్ 30 నుంచి కాంగ్రెస్ ఆందోళనలు
దిల్లీ వార్ రూమ్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం.. పెరుగుతున్న నిరుద్యోగం, రైతు సమస్యలపై ఆందోళనలు ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వార్ రూమ్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం
వార్ రూమ్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం
ఇదీ చూడండి : అన్నంపెట్టే అమ్మ లేదు.. నడిపించే నాన్న రాడు...