హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను టీపీసీసీ చీఫ్ దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. విజయవాడ-హైదరాబాద్ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య బుల్లెట్ రైలు ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజారవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని పేర్కొనగా అందుకు సానుకూలంగా రాష్ట్రపతి స్పందించినట్లు ఉత్తమ్ తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ద్వారా... కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలపై కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. పూర్తి వివరాలతో తనను దిల్లీలో కలువాలని రాష్ట్రపతి సూచించారు. పూర్తి వివరాలతో త్వరలో రాష్ట్రపతిని కలుస్తానని ఉత్తమ్ తెలిపారు.
రాష్ట్రపతిని కలిసిన ఉత్తమ్ దంపతులు - Uttam Meet President today news
హైదరాబాద్-విజయవాడల మధ్య బుల్లెట్ రైలు ప్రవేశ పెట్టే అంశమై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డిలు విజ్ఞప్తి చేశారు.
![రాష్ట్రపతిని కలిసిన ఉత్తమ్ దంపతులు Uttam Meet President](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5515460-509-5515460-1577469886744.jpg)
Uttam Meet President