తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్కా ప్రణాళికతో ప్రచారం: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - ఉత్తమ్​ కుమార్​ రెడ్డి వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి గాంధీభవన్​లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

uttam kumar reddy meeting conduct with party leaders in hyderabad
పక్కా ప్రణాళికతో ప్రచారం: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

By

Published : Feb 14, 2021, 8:22 PM IST

తెలంగాణలో అన్ని వర్గాలను తెరాస మోసం చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. భాజపా మతం పేరుతో రాజకీయం చేయడం తప్ప నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మండలి కాంగ్రెస్​ అభ్యర్థులు రాములు నాయక్​, చిన్నారెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో ప్రచారం నిర్వహించాలన్నారు. సోషల్ మీడియాలో ప్రచారాలు విస్తృతంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస, భాజపాకు బుద్ధి చెబితేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. సామాజిక న్యాయం ప్రాతిపాదికగా రాములు నాయక్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌ యూటీపై క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details