తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్​ గాంధీపై దాడికి ప్రతిఘటన తప్పదు: ఉత్తమ్​ - uttam on Hathrus incident

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై ఉత్తర్​ప్రదేశ్​ పోలీసుల దాడిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. సామూహిక అత్యాచారానికి గురై, మృతి చెందిన దళిత యువతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ ఘటనకు ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

uttam kumar reddy fires on UP government police
రాహుల్​ గాంధీపై దాడికి ప్రతిఘటన తప్పదు: ఉత్తమ్​

By

Published : Oct 1, 2020, 7:09 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఉత్తర్​ప్రదేశ్ పోలీసుల దాడి, లాఠీఛార్జీని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్​రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్‌ అరెస్టు పిరికి పందల చర్య, సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనలకు ప్రతిఘటన ఉంటుందని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.

ఉత్తర్​ప్రదేశ్‌లోని హాథ్రస్​లో ఒక దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిపి.. అత్యంత పాశవికంగా హత్య చేశారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా.. యువతి మృతదేహాన్ని పోలీసులు దహనం చేయడమేంటంటూ ఆయన మండిపడ్డారు.

ఇంత దారుణం జరిగితే బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అడ్డుకుని.. వారిపై దాడి చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధల్లో ఉన్నవారిని పరామర్శించడం ధర్మమని ఆయన గుర్తు చేశారు. ఇదంతా దేశ ప్రజలు చూస్తున్నారని.. ఇందుకు ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

ఇదీ చూడండి: యూపీ 'నిర్భయ' మృతి- పెల్లుబుకిన జనాగ్రహం

ABOUT THE AUTHOR

...view details