కాంగ్రెస్ హయాంలో దళితులు, గిరిజనులకు లక్షల ఎకరాల భూ పంపిణీ చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో భూ దందాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాయనున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. భూ ఆక్రమణలపై ఇందిరాభవన్‌లో దూరదృశ్య మాధ్యమం ద్వారా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
భూ దందాలపై గవర్నర్‌కు లేఖ రాస్తా: ఉత్తమ్ - uttam kumar reddy news
రాష్ట్రంలో భూదందాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు లేఖ రాయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూముల ఆక్రమణలపై ఇందిరాభవన్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
![భూ దందాలపై గవర్నర్‌కు లేఖ రాస్తా: ఉత్తమ్ uttam kumar reddy, uttam leeter to governor on land occupations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:43:57:1620436437-11675495-uttam.jpg)
ఉత్తమ్ కుమార్ రెడ్డి, భూ దందాలపై ఉత్తమ్ లేఖ
తెరాస నాయకులు దొంగల ముఠాలా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ భూపోరాటం చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వాళ్లే కబ్జాలకు పాల్పడుతున్నారని.. మంత్రులు, నాయకులు అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.
ఇదీ చదవండి:నేటి నుంచి కరోనా టీకా మొదటి డోసు నిలిపివేత