తెలంగాణ

telangana

ETV Bharat / state

'భయపడేది లేదు... ప్రజల పక్షాన పోరాటంలో రాజీపడే ప్రసక్తేలేదు'

హైదరాబాద్​ ఇందిరాభవన్​లో హోంమంత్రి ఇంటి వద్ద ధర్నా చేసి అరెస్టు అయిన 68 మంది కాంగ్రెస్‌ శ్రేణులతో... రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్​, పీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి సమావేశమయ్యారు. నాయకులెవరూ భయపడాల్సిన పని లేదని ఉత్తమ్​ సూచించారు.

Uttam Kumar Reddy Criticised telangana police
వాళ్లు ఐపీఎస్​ కాదు.. కేపీఎస్​(కేసీఆర్​ ప్రైవేటు సైన్యం): ఉత్తమ్​కుమార్​రెడ్డి

By

Published : Oct 13, 2020, 1:57 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్​ పోరాటం ఆగదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి స్పష్టం చేశారు. హోంమంత్రి ఇంటి వద్ద ధర్నా చేసి అరెస్టు అయిన 68 మంది కాంగ్రెస్‌ శ్రేణులతో ఇందిరా భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్​, పీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఇతర నాయకులు సమావేశమయ్యారు. నాయకులెవరూ భయపడాల్సిన పని లేదని సూచించారు.

సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్​

రాష్ట్రంలో ఏ అధికారి కూడా ప్రజల కోసం పనిచేయడం లేదని... పోలీసులయితే ఉద్యోగులని కూడా మార్చిపోయారని.. ఉత్తమ్​ ఆరోపించారు. ఐపీఎస్​ కాదు.. కేపీఎస్​(కల్వకుంట్ల ప్రైవేట్​ సైన్యం)లా పోలీసులు తయారయ్యారని విమర్శించారు.

ప్రజాసమస్యలపై ప్రతిపక్షంగా తమ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని.. ఎక్కడ ఆగేది లేదని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటామని.. వారికి అండగా నిలబడుతామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details