రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌లో చెరువు శిఖం భూమిని ఆక్రమించి మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాలలు నిర్మించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన ఎన్ఎస్యూఐ విద్యార్థులను అరెస్ట్ చేయటం దారుణం అన్నారు.
విద్యార్థి సంఘం నేతల అరెస్ట్ దారుణం: ఉత్తమ్ కుమార్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్తలు
ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులకు అండగా ఉంటామన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్, మరికొంత మందిపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వారిపై అక్రమంగా నిర్భందించారని.. విద్యార్థులకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:బ్యాంక్ ఉద్యోగులపై కరోనా పంజా.. పనివేళలు కుదించాలని విజ్ఞప్తి