మాజీ ఎంపీ నంది ఎల్లయ్య జీవితం పార్టీ నాయకులకు ఆదర్శమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలను, క్రమశిక్షణను పార్టీ నేతలు అంతా ఆచరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన సంతాప సభలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియాలతోపాటు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ తదితరులు పాల్గొని.. నంది ఎల్లయ్యకు సంతాపం తెలిపారు.
'ఆయన సిద్ధాంతాలు, క్రమశిక్షణ పార్టీ నేతలు అనుసరించాలి' - మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
కార్పొరేటర్ స్థాయి నుంచి ఆరు సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. దేశంలో గొప్ప నాయకుల్లో నంది ఎల్లయ్య ఒకరన్నారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం వక్తం చేశారు.
నంది ఎల్లయ్య కరోనా బారిన పడి మృతి చెందడం చాలా బాధాకరని ఉత్తమ్ అన్నారు. ఆయనకు నిమ్స్‌లో నివాళి అర్పించడానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌ను పార్టీ తరఫున పంపించినట్లు తెలిపారు. దళిత వర్గాలకు ఆయన ఆశాజ్యోతి అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియా ప్రశసించారు. క్రమ శిక్షణకు మారుపేరు, నిజాయతీపరుడు, కార్మిక వర్గాలకు అండగా ఉండే వ్యక్తి నంది ఎల్లయ్య అని పేర్కొన్నారు. ఆయన యాభై ఏళ్ల రాజకీయ జీవితం ప్రజా సేవకే అంకితం చేశాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.
ఇదీ చూడండి :ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత