సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖలు రాశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
లేఖలు రాయటంతో పాటు చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో ఉత్తమ్, భట్టి ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.