తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​కు ఉత్తమ్ లేఖ... మండలి ఛైర్మన్ తీరుపై ఫిర్యాదు - మండలి ఛైర్మన్​ గుత్తా సుకేందర్​ రెడ్డిపై గవర్నర్​కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్​కుమార్​ రెడ్డి

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి గవర్నర్​కు లేఖ రాశారు. శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి హుజూర్​నగర్ ఉపఎన్నిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ గవర్నర్‌ తమిళి సైకు ఉత్తమ్​ ఫిర్యాదు చేశారు.

మండలి ఛైర్మన్​పై గవర్నర్​కు ఉత్తమ్​ ఫిర్యాదు

By

Published : Sep 27, 2019, 7:52 PM IST

Updated : Sep 28, 2019, 7:07 AM IST

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ గవర్నర్​ తమిళిసైకు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ లేఖ రాశారు. శాసన మండలి ఛైర్మన్​గా ఉన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. పాలకీడు జడ్పీటీసీ సభ్యుడు మోతీలాల్‌ నాయక్‌, సర్పంచి జితేందర్‌ రెడ్డిని... ఫిల్మ్‌ ఛాంబరులోని తన ఇంటికి పిలిపించుకుని పెద్దమొత్తంలో డబ్బు ఆశచూపి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. అదేవిధంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను కూడా పిలుస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుమారుడు అమిత్‌ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టులో 15వ ప్యాకేజీకి సంబంధించి రూ.719 కోట్లు విలువైన పనులను, ఆయన బంధువుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు చెందిన రెండు ప్యాకేజీల కింద 37వేల కోట్లకు పైగా విలువైన పనులను అప్పగించినట్లు ఆరోపించారు. హుజూర్​నగర్​లో ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.

గవర్నర్​కు ఉత్తమ్ లేఖ... మండలి ఛైర్మన్ తీరుపై ఫిర్యాదు
Last Updated : Sep 28, 2019, 7:07 AM IST

For All Latest Updates

TAGGED:

uttam letter

ABOUT THE AUTHOR

...view details