మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు.. పాలనలో తనదైన ముద్ర వేశారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారని పీవీ సేవలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆయన దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివన్నారు.
UTTAM KUMARREDDY: పీవీ సేవలు చిరస్మరణీయం: ఉత్తమ్ కుమార్‌రెడ్డి - pv Centennial Closing Celebrations by Zoom
ఇందిరా భవన్‌లో పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాలను జూమ్ ద్వారా నిర్వహించారు. ఆయన రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నేతలు కొనియాడారు.
పీవీ సేవలు చిరస్మరణీయం: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
గీతా రెడ్డి నేతృత్వంలో... ఇందిరా భవన్‌లో పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాలను జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మానిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీవీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు స్వీకరించనున్న డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పీవీ సోదరులు మనోహర్ రావ్ తదితరులు పాల్గొన్నారు. దేశ పురోభివృద్ధికి పీవీ సేవలను కాంగ్రెస్ నేతలు కొనియాడారు.