ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆపత్కాల సాయం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల టీఎస్‌యూటీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: టీఎస్‌యూటీఎఫ్ - tsutf on government's decision
ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు రూ.2000 సాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వాగతించింది. వీరితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తోన్న విద్యా వాలంటీర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్రాయింగ్ కోర్సుల పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లనూ ఆదుకోవాలని కోరింది.
ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తోన్న సుమారు 15 వేల మంది విద్యా వాలంటీర్లు, 3 వేల మంది ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్రాయింగ్ కోర్సుల పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లను విధుల్లోకి తీసుకోలేదని యూటీఎఫ్ తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి గౌరవ వేతనంపైనే ఆధారపడి జీవనం గడుపుతున్న వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించింది. వారికీ ప్రభుత్వ సాయం అందించాలని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవిలు ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: ఈనెల నుంచే ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం: మంత్రులు