తెలంగాణ

telangana

ETV Bharat / state

పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి: యూటీఎఫ్​ - హైదరాబాద్​ వార్తలు

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కె జంగయ్య అధ్యక్షతన దృశ్య మాధ్యమ(వర్చువల్) పద్ధతిలో జరిగింది. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి: యూటీఎఫ్​
పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి: యూటీఎఫ్​

By

Published : Aug 30, 2020, 8:40 PM IST

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కె జంగయ్య అధ్యక్షతన దృశ్య మాధ్యమ(వర్చువల్) పద్ధతిలో జరిగింది. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేసింది.

ఐదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న అంతర్​జిల్లా బదిలీలను పాఠశాలల ప్రారంభానికి ముందే చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఐఆర్, పీఆర్సీలపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని నర్సిరెడ్డి ప్రశ్నించారు.

ఇవీచూడండి:జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు

ABOUT THE AUTHOR

...view details