తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఆర్​సీ సిఫారసులను అంగీకరించేది లేదు: యూటీఎఫ్​

ఫిట్​మెంట్​ 45 శాతానికి దగ్గరగా ఉంటేనే అంగీకరిస్తామని యూటీఎఫ్ స్పష్టం చేసింది. మంచి ఫిట్​మెంట్​ ఇవ్వకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తేల్చి చెప్పింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిటీతో సమావేశమైన యూటీఎఫ్​ నేతలు.. కమిటీ తమ వాదనలు వినడం కంటే నచ్చజెప్పే ప్రయత్నమే చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

utf confimed that PRC recommendations Does not acceptable
పీఆర్​సీ సిఫారసులను అంగీకరించేది లేదు: యూటీఎఫ్​

By

Published : Jan 28, 2021, 2:06 PM IST

పీఆర్​సీ సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్​) స్పష్టం చేసింది. ఫిట్​మెంట్​ 45 శాతానికి దగ్గరగా ఉంటేనే అంగీకరిస్తామని తేల్చి చెప్పింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిటీతో సమావేశమైన యూటీఎఫ్​ నేతలు.. కమిటీ తమ వాదనలు వినడం కంటే నచ్చజెప్పే ప్రయత్నమే చేశారని వ్యాఖ్యానించారు. కరోనా పరిస్థితుల్లో ఆదాయం తగ్గిపోయిందని.. నాలుగైదేళ్లు కోలుకునే పరిస్థితి లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పీఆర్​సీ సిఫారసులను అంగీకరించేది లేదు: యూటీఎఫ్​

పీఆర్​సీ నివేదిక బాగానే ఉందనే అభిప్రాయం ఆమోదనీయం కాదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఫిట్​మెంట్​ ఇవ్వకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. గ్రాట్యుటీ రూ. 20 లక్షలకు పెంచాలని.. కనీస వేతనం రూ. 24 వేలుగా పరిగణించాలని సీఎస్​ కమిటీకి సూచించామని తెలిపారు. 2018 నుంచే ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని.. గురుకులాలకు పీఆర్​సీ అమలు చేయాలని స్పష్టం చేశారు. పదవీ విరమణ వయసు పెంపు ఈ నెలలోనే అమలు చేయాలని, రాష్ట్రంలోని అన్ని సంఘాలను చర్చలకు పిలవాలని కమిటీని కోరినట్లు నేతలు వెల్లడించారు.

7.5 శాతం ఫిట్‌మెంట్ ఆమోదయోగ్యం కాదు: పీఆర్టీయూ

ABOUT THE AUTHOR

...view details