తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా తీవ్రతను బట్టి ప్లాస్మా థెరపీ : డా. ప్రమోద్​కుమార్​ - Corona Plasma Therapy Gandhi Hospital

కరోనా వ్యాధి తీవ్రతను బట్టి ప్లాస్మా థెరపీని వాడుతామని గాంధీ ఆసుపత్రి పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ డా. ప్రమోద్ కుమార్ తెలిపారు. వ్యాధి సోకిన అందరికి దీన్ని ఉపయోగించలేమని చెప్పారు. మాసబ్ ట్యాంకులోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

ప్రొఫెసర్ డా. ప్రమోద్ కుమార్
ప్రొఫెసర్ డా. ప్రమోద్ కుమార్

By

Published : Apr 28, 2020, 2:22 PM IST

రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 85 శాతం వరకు వ్యాధి నుంచి బయటపడతారని ఆరోగ్య రంగ నిపుణులు, గాంధీ ఆసుపత్రి పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ డా. ప్రమోద్ కుమార్ తెలిపారు. అపోలో క్రిటికల్ కేర్ విభాగం ఇన్​ఛార్జ్​ డా. సుబ్బారెడ్డితో కలిసి... మాసబ్ ట్యాంకులోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

కరోనా వ్యాధి తీవ్రతను బట్టి ప్లాస్మా థెరపీని వాడుతామని... గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీపై ప్రత్యేక కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో చిన్న పిల్లలు, 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారిలో మరణాలు తక్కువ ఉన్నాయని తెలిపారు. లాక్​డౌన్ ఒక్కసారిగా ఎత్తివేస్తే వైద్య సదుపాయాలు సరిపోవన్నారు. దశలవారీగా ఎత్తేయటం వల్ల వైద్య సేవలు అందించే వీలుంటుందని చెప్పారు.

ఇవీ చూడండి:కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు

ABOUT THE AUTHOR

...view details