తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటికో గుర్రం.. అదే గుర్రాల గ్రామం - hyderabad recent news

మనం ఏదైనా పని మీద పక్క వీధికో, దగ్గరలోని స్నేహితుడి ఇంటికో నడిచి గానీ లేకపోతే సైకిల్​పై వెళ్తాం. అదే దూరమైతే బైక్ మీదో, బస్సులోనో, ఆటోలోనే వెళ్లిపోతాం. కానీ, ఓ గ్రామంలోని ప్రజలకు గుర్రాలే వాహనాలు.. ఎందుకంటే అక్కడ బైకులు, ఇతర వాహనాలు ఏమీ ఉండవు. ఇంతకీ ఆ ఊరెక్కడో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా.

using horses for every work in dayaparthi in vishakapatnam
ఆ గ్రామంలో గుర్రాలే వాహనాలు..

By

Published : Feb 10, 2021, 12:46 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో దాయర్తి ఆనే ఓ మారుమూల గ్రామం ఉంది. ఆ ఊరిలో మనుషులతో సమానంగా గుర్రాలు కనిపిస్తాయి. అంటే, దాదాపు ఇంటికో గుర్రం ఉంటుంది. అందుకే ఆ ఊరిని "గుర్రాల గ్రామం' అని పిలుస్తుంటారు.

రాళ్లబాటలో నడిచి వెళ్తేనే

దాయర్లి గ్రామం దూరంగా అడవుల్లో విసిరేసినట్లు ఉంటుంది. రోడ్డు, విడ్యుత్తు సదుపాయాలు ఏమీ లేవు ఈ ఊరికి చేరుకోవాలంటే కొండ నుంచి రాళ్ల బాటలో ఆరేడు కిలో మీటర్లు నడవాల్సిందే. అలాంటి ప్రాంతానికి రవాణా సౌకర్యాలు ఉండవు కాబట్టి అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాల కోసం గుర్రాలను వినియోగిస్తుంటారు. అటవీ ఉత్పత్తులు, పంటలు అమ్ముకోవాలన్నా ఏమైనా కొనాలన్నా... కొండ ఎక్కాలన్నా, దిగాలన్నా...వారికి ఆ మూగజీవాలే ఆధారం.

గుర్రాలే ఆస్తి

ఈ గిరిజన గ్రామానికి వందేళ్ల చరిత్ర ఉందట. ఊరు ఏర్పడ్డ కొత్తలో పది నిసాలుంటే. మూడు, నాలుగు గుర్రాలుండేవి. ఇప్పుడు ఇళ్ల సంఖ్య 80కి పెరగ్గా, గుర్రాలు 60 పైగా ఉన్నాయి. తరతరాలుగా వారికి వచ్చే ఆస్తి ఈ గుర్రాలే. అంతేకాదండోయ్.. ఊరిలో జరిగే పెళ్లిళ్లకు గుర్రాలను కానుకగా ఇచ్చే ఆచారం కూడా ఉంది. చుట్టుపక్కల దాదాపు పది వరకు చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. వాళ్లకు ఏ అవసరమొచ్చినా.. అనారోగ్యమైనా దాయర్తి అశ్వాలే ఆధారం. ఇక్కడ గుర్రాల సంతలు కూడా జరుగుతాయి.

ఆ గ్రామంలో గుర్రాలే వాహనాలు..

కంటికి రెప్పలా..

గుర్రాల పెంపకం, పోషణ ఖర్చుతో కూడుకున్నది. దాయర్తి ప్రజలు పేదవాళ్లు కావడంతో ప్రయాణం చేయాల్సిన సమయంలోనే గుర్రాలకు దాణా పెడతారు. మిగతా రోజుల్లో అని అడవుల్లోని పచ్చగడ్డి ,కాయలు తింటుంటాయి. అశ్వాలను పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయ ఆస్తిగా భావించే ప్రజలు వాటిని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇక్కడ పిల్లలు ఏడిస్తే గుర్రం ఎక్కించి తిప్పుతారట....పట్టణాలు, నగరాల్లో బైక్ మీద తిప్పినట్లు.

ఇదీ చదవండి:లైవ్ వీడియో: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details