తెలంగాణ

telangana

ETV Bharat / state

'బకాయిలను చెల్లించేందుకు వన్​టైం స్కీంను వినియోగించుకోవాలి' - జీహెచ్​ఎంసీ తాజా వార్తలు

బకాయిలను చెల్లించుటకు వన్​టైం స్కీంను వినియోగించుకోవాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​ పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు 45రోజుల పాటు వన్ టైం స్కీం అమలులో ఉంటుందని తెలిపారు.

ghmc commissioner lokesh kumar
ghmc commissioner lokesh kumar

By

Published : Jul 30, 2020, 7:53 PM IST

ఆస్తిపన్ను బకాయిలను చెల్లించుటకు ప్రభుత్వం కల్పించిన వన్​టైం స్కీంను వినియోగించుకోవాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​ కోరారు. బకాయి మొత్తంతో పాటు.. విధించిన వడ్డీలో 10శాతం చెల్లిస్తే.. 90శాతం వడ్డీ రాయితీ ఉంటుందని కమిషనర్​ స్పష్టం చేశారు.

ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు 45 రోజుల పాటు వన్ టైం స్కీం అమలులో ఉంటుందని వివరించారు. నగరంలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు, బిల్ కలెక్టర్లు, మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ ద్వారా మొబైల్‌ యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చునని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details