తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లు.. సీఎం ప్రశంసలు - Cm kcr on Mission Bhagiratha water bottles

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ నీటి బాటిళ్ల వినియోగం ప్రారంభమైంది. ఆదివారం సీఎం నిర్వహించిన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమీక్షలో మిషన్ భగీరథ బాటిళ్లనే ఉపయోగించారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో మిషన్‌ భగీరథ నీటిబాటిళ్ల వినియోగం
ప్రభుత్వ కార్యక్రమాల్లో మిషన్‌ భగీరథ నీటిబాటిళ్ల వినియోగం

By

Published : Jan 25, 2021, 6:51 AM IST

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ నీటి బాటిళ్ల వినియోగం ప్రారంభమైంది. గ్రామపంచాయతీ మొదలు సచివాలయం వరకు భగీరథ బాటిళ్లనే ఉపయోగించాలని శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించగా... అందుకు అనుగుణంగా ఆదివారం సీఎం నిర్వహించిన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమీక్షలో మిషన్ భగీరథ బాటిళ్లనే ఉపయోగించారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు... అందరికీ ఈ బాటిళ్లను అందించారు. తెలంగాణ రాష్ట్ర విజయాలను సమావేశంలో ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. మిషన్ భగీరథ గురించి కూడా వివరించారు. అదే సమయంలో భగీరథ బాటిల్‌ని చూపుతూ ఈ పరిణామాన్ని ఎవరైనా ఊహించారా అని వ్యాఖ్యానించారు. దీనికోసం కృషిచేసిన అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ఇదీ చూడండి :'సాగులో తెలంగాణ దేశానికే రోల్​ మోడల్'

ABOUT THE AUTHOR

...view details