US Visa Application Center at Hitech City: హైదరాబాద్‌లోని అమెరికా వీసా దరఖాస్తు కేంద్రం చిరునామా మారింది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో ఆ కార్యాలయాన్ని అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముందస్తుగా తీసుకున్న అపాయింట్‌మెంట్ (వేలిముద్రల కోసం), వీసా దరఖాస్తు పత్రాల సమర్పణ, ఇంటర్వ్యూ తరవాత పాస్‌పోర్టు తీసుకోవడం తదితర సేవలు అందించే హైదరాబాద్ వీసా అప్లికేషన్ సెంటర్‌ను హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లోని ప్రాంగణంలో(లోయర్ కాన్కోర్స్) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయం బేగంపేటలోని కాన్సులేట్ సమీపంలోని గౌరా గ్రాండ్ భవన్‌లో ఉంది. ఆదివారం నుంచి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లోకి మారింది. నేటి నుంచి ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
వీసాకు ముందు డాక్యుమెంటేషన్ వద్ద బయోమెట్రిక్స్, డ్రాప్ బాక్స్ సేవలు తర్వాత ఇంటర్వ్యూ ఫార్మాలిటీలతో సేవలు అందుబాటులో ఉన్నాయి. నానక్‌రామ్‌గూడలోని నూతన క్యాంపస్‌కు యూఎస్ కాన్సులేట్‌ను మార్చాలనే ప్రణాళికలో భాగంగా ఈ కేంద్రం మార్చబడింది. నేటి నుంచి అపాయింట్‌మెంట్‌లు, పత్రాల సమర్పణ, పాస్‌పోర్టు సేకరణ కోసం వీసా దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించే దరఖాస్తుదారులందరూ కొత్త లొకేషన్‌కు మార్చిన కార్యాలయాన్ని సందర్శించవలిసిందిగా అధికారులు తెలిపారు.