రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) డిజిథాన్ చేస్తున్న కృషిని అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను కోడింగ్ స్కిల్స్ నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ కొనియాడింది.
రాష్ట్ర ప్రభుత్వం, టీటా డిజిథాన్‌కు ప్రశంసలు - రాష్ట్ర ప్రభుత్వం, టీటా డిజిథాన్‌కు ప్రశంసలు హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ డిజిథాన్ కృషికి ప్రశంసలు దక్కాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోడింగ్ స్కిల్స్ నేర్పుతున్నందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ కొనియాడింది. ప్రభుత్వం, టీటా డిజిథాన్ బృందం కృషిని ప్రశంసిస్తూ ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వం, టీటా డిజిథాన్‌కు ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీటా డిజిథాన్ బృందం చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు లేఖ రాసింది. ఈ లేఖ పట్ల కృతజ్ఞతలు తెలియజేసిన జయేశ్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలందించేందుకు కృషి చేస్తోన్న డిజిథాన్ చొరవను అభినందించారు.
TAGGED:
tita digethon latest news