యూఎస్ కౌన్సిలేట్ భద్రతాధికారి జాన్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిశారు. కొద్దిసేపు భేటీ అయ్యారు. కొవిడ్ సమయంలో హైదరాబాద్ పోలీసులు విశేష పనితీరు కనబరిచారని.. భద్రత అధికారి జాన్ ప్రశంసించారు.
హైదరాబాద్ సీపీతో యూఎస్ కౌన్సిలేట్ భద్రతాధికారి భేటీ - Latest news in Telangana
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో యూఎస్ కౌన్సిలేట్ భద్రతాధికారి జాన్ భేటీ అయ్యారు. కొవిడ్ సమయంలో హైదరాబాద్ పోలీసులు విశేష పనితీరు కనబరిచారని.. భద్రత అధికారి జాన్ ప్రశంసించారు.
సీపీ అంజనీకుమార్‌తో యూఎస్ కౌన్సిలేట్ భద్రతాధికారి భేటీ
వలస కూలీలను స్వస్థలాలకు తరలించడం, కొవిడ్ సోకిన వారిని ఆసుపత్రులకు తరలించడంతో పాటు.. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ కాప్స్ వర్సెస్ కొవిడ్ పుస్తకాన్ని జాన్‌కు అందజేశారు.