హైదరాబాద్ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత రాత్రి నుంచి నిరసన బాట పట్టిన విద్యార్థులు ఈ రోజు తరగతులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు.
ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. రాత్రి నుంచి వర్సిటీ బయట పోలీసులను మోహరించారు. మరో వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోనూ ఆందోనలు కొనసాగాయి.
సీఏబీకి వ్యతిరేకంగా ఉర్దూ యూనివర్సిటీలో ఆందోళనలు - urdhu university students protest against CAB
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆందోళను కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు హైదరాబాద్‌లోనూ ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. బిల్లుకు వ్యతిరేకిస్తూ మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసనకు దిగారు.
సీఏబీకి వ్యతిరేకంగా ఉర్దూ యూనివర్సిటీలో ఆందోళనలు
ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు