హైదరాబాద్ నగర శివారులో సహజ సిద్ధమైన అడవుల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్‌లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ లోకేశ్‌కుమార్ ప్రకటించారు. వందల ఎకరాల్లో అర్బన్ పార్కులను సృష్టిస్తున్నామని, కంచె నిర్మాణ పనులు తుది దశకొచ్చినట్లు తెలిపారు. వాటిలో మూడు అంచెల్లో మొక్కలు పెంచనున్నారు. ఈసారి హరిత హారంలో 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇందులో ఎక్కువ శాతం మొక్కలు అర్బన్ ఫారెస్టు ప్రాంతాల్లో నాటుతామని కమిషనర్ వివరించారు.
హరితం సతతం: హైదరాబాద్ చుట్టూ అడవుల నిర్మాణానికి శ్రీకారం - harithahaaram
హైదరాబాద్ చుట్టూ సహజ సిద్ధమైన అడవులు పెంచేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. శివారుల్లోని పలు ప్రాంతాలను ఎంచుకుని అడవులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఈసారి నిర్వహించే హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎక్కువశాతం మొక్కలు అర్బన్ ఫారెస్టు ప్రాంతాల్లో నాటుతామని కమిషనర్ వివరించారు.
సహజ సిద్ధమైన అడవిలో చెట్లు మూడు అంచెల్లో ఉంటాయి. ఏపుగా పెరిగిన వాటిని మొదటి పొరగా, మధ్య స్థాయి ఎత్తుండే వాటిని రెండో పొరగా, చిన్నపాటి మొక్కలను మూడో పొరగా పరిగణిస్తారు. వీటికి అదనంగా గుబురు పొదలు ఉంటాయి. అప్పుడే అడవుల్లో అన్ని రకాల జీవజాతులు మనగలుగుతాయి. ఈ తరహాలోనే నగర శివారులో మూడు అర్బన్ ఫారెస్టులను అభివృద్ధి చేయనున్నారు. ఏపుగా, విశాలంగా పెరిగే దేశీ మొక్కలను నాటి.. నగరవాసులకు విడిది కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. తద్వారా నగరంలో వాతావరణం సైతం మెరుగవుతుందని కమిషనర్ వెల్లడించారు.