తెలంగాణ

telangana

ETV Bharat / state

అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది? - bullet in young woman body

నడుం నొప్పికి శస్త్రచికిత్స కోసం నిమ్స్​కి వెళ్లిన యువతి వెన్నులో తూటా ఉన్నట్లు గుర్తించిన కేసులో ఉత్కంఠ ఇంకా వీడలేదు. యువతి దేహంలో రెండేళ్లుగా బుల్లెట్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Upto now young woman bullet issue do not solved
యువతి దేహంలో బుల్లెట్

By

Published : Dec 23, 2019, 8:19 PM IST

హైదరాబాద్​ యువతి వెన్నులో తూటా ఉన్న కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేశారు. యువతి దేహంలో బుల్లెట్ ఉండటంపై రెండు బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండేళ్లుగా యువతి శరీరంలో బుల్లెట్ ఉన్నట్టుగా గుర్తించినట్లు తెలిపారు.

యువతి అస్మాబేగం కుటుంబ నేపథ్యం, స్థానిక పరిస్థితులపై విచారణ చేస్తున్నామన్నారు. బుల్లెట్ ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తూటాపై కుటుంబసభ్యుల అనుమానాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. బుల్లెట్ ఏ మోడల్ అన్న దానిపై ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బుల్లెట్‌పై పూర్తి వివరాల కోసం ఎఫ్ఎస్ఎల్‌కు పోలీసులు పంపించారు.

ప్రస్తుతం యువతి పాతబస్తీ ఫలక్​నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలోని చార్​కమాన్ ప్రాంతంలో యువతి తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది.

యువతి దేహంలో బుల్లెట్

ఇవీ చూడండి: బేగంపేటలో 25వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం

ABOUT THE AUTHOR

...view details