నిరుద్యోగులకు యూపిఎస్సీ శుభవార్త చెప్పింది. తాజాగా వివిధ సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం, తదితర వివరాలను వెల్లడించింది.
వివరాలు..
* సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 712
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2021 నాటికి 21 ఏళ్లు తగ్గకుండా, 32 ఏళ్లు మించకుండా ఉండాలి. 02.08.1989 - 01.08.2000 మధ్య జన్మించి ఉండాలి.
ప్రయత్నాల సంఖ్య: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అన్‌లిమిటెడ్, ఓబీసీ అభ్యర్థులకు-9 ప్రయత్నాలు.
ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా.
ప‌్రిలిమినరీ పరీక్ష:
ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోదానికి 200 మార్కులు కేటాయిస్తారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు. ప్రిలిమినరీ పరీక్షలో పేపర్-2 జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33% అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్షను మొత్తం 2025 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పేపర్లు, సిలబస్, ఇతర పూర్తి వివరాలు ప్రకటనలో చూడవచ్చు.
ప్రిలిమ్స్ పరీక్షతేది: 27.06.2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేది: 24.03.2021.
ఇదీ చదవండి:కేవలం 77వేల ఉద్యోగాలే భర్తీ అయ్యాయి: కోదండరాం