తెలంగాణ

telangana

ETV Bharat / state

Mahesh Bhagwat: మరోమారు వాట్సాప్​ 'గురు' హవా.. సివిల్స్​లో వందమందికి పైగా ఎంపిక - whatsapp guru

ఆయన ఒక పోలీసు కమిషనర్​... విధి నిర్వహణలో తీరిక లేని పనులు... కమిషనరేట్‌కు బాస్​, నిరంతరం శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలై ఉంటారు. అయినా సరే దేశంలో అత్యున్నతమైన పరీక్ష సివిల్స్​(Upsc Civils)కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇస్తూ.. వాట్సాప్​ 'గురు'గా పేరొందారు. ఆయనే రాచకొండ సీపీ మహేశ్ భగవత్​(Rachakonda cp Mahesh Bhagwat). ఈ సారి కూడా అభ్యర్థులకు తన విలువైన సమయాన్ని కేటాయించి.. వారికి దిశానిర్దేశం చేశారు. అందుకే వందమందికి పైగా ర్యాంకులు సాధించారు.

whats app guru, mahesh bhagwat
వాట్సాప్​ గురు, మహేశ్​ భగవత్​

By

Published : Sep 25, 2021, 8:19 AM IST

Updated : Sep 25, 2021, 9:01 AM IST

సివిల్స్‌(Upsc Civils)లో మౌఖిక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విలువైన సలహాలు.. సూచనలిస్తూ వాట్సప్‌ ‘గురు’(Whatsapp Guru)గా పేరొందిన రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌​(Rachakonda cp Mahesh Bhagwat) మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. శుక్రవారం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో ఆయన సలహాలు, సూచనలు పాటించిన వంద మందికిపైగా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు పొందారు. అంకితాజైన్‌ మూడో ర్యాంక్‌ సాధించగా, తొలి 100 ర్యాంకుల్లో 14 మంది ఉండటం విశేషం.

వీరిలో ముంబయికి చెందిన కరిష్మా నాయర్‌(14), రాధికా గుప్తా(18), హైదరాబాద్‌కు చెందిన పి.శ్రీజ(20), అనిషా శ్రీవాత్సవ్‌(66) ఇతర రాష్ట్రాల నుంచి.. వైష్ణవీ జైన్‌(21), మృణాలీ జోషి(36), వినాయక్‌ నరవాడే(37), పూజాగుప్తా(42), శైలజాపాండే(61), అషితా గుప్తా(69), ధ్రువ్‌ ఖేడియా(72), చల్లపల్లి యశ్వంత్‌ కుమార్‌రెడ్డి(93) వినాయక్‌ మహాముని(95) ఉన్నారు. మెయిన్స్‌కు ఎంపికైన వారి ఆలోచనలు, దృక్పథాలను తెలుసుకుని మార్పులు సూచిస్తూ వారి విజయానికి సహకరిస్తున్నానని సీపీ మహేశ్‌భగవత్‌ చెప్పారు. మౌఖిక పరీక్షకు వారం రోజుల ముందు అనీషా శ్రీవాత్సవ్‌ తన తండ్రితో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి మాట్లాడారని వివరించారు.

ఇదీ చదవండి:upsc results 2021: సివిల్స్​లో తెలుగు తేజాలు.. వంద ర్యాంకుల్లోపు ఎనిమిది మనోళ్లవే

Last Updated : Sep 25, 2021, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details