ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, అంతర్జాతీయ ఆర్యవైశ్య సమాఖ్య అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్వీకరించారు. హైదరాబాద్ నాగోల్‌లోని ఆయన నివాసంలో మూడు మొక్కలను నాటారు. అనంతరం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇండియా అశోక్ అగర్వాల్‌కు ఈ ఛాలెంజ్‌ను విసిరారు.
'రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి పర్యావరణమే' - రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అంతర్జాతీయ ఆర్యవైశ్య సమాఖ్య అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్వీకరించారు. తన నివాసంలో మూడు మొక్కలను నాటారు. రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి పర్యావరణమే అని ఆయన తెలిపారు.

'రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి పర్యావరణమే'
ఆయన కూడా మూడు మొక్కలను నాటాలని, అలాగే మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని ఉప్పల శ్రీనివాస్ గుప్తా కోరారు. కాలుష్యం వల్ల మానవాళి మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందని.. రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది పర్యావరణమే అన్నారు.
ఇవీ చూడండి: మొక్కల పెంపకం ఆహ్లాదకరం.. ఆరోగ్యకరం