తెలంగాణ

telangana

ETV Bharat / state

34 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం - రామంతాపూర్

హైదరాబాద్​లో ఓ గోదాంలో నిల్వ ఉంచిన 34 టన్నుల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని, బియ్యాన్ని పౌరసరఫరా శాఖకు అప్పగించారు.

34 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

By

Published : Aug 8, 2019, 9:55 PM IST

హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్​లో ఓ గోదాంలో నిల్వ ఉంచిన 34టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక లారీ, 12 చరవాణిలు, 13మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత రెండు నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఓ వ్యక్తి రేషన్‌ దుకాణాల్లో డీలర్లు, లబ్దిదారుల వద్ద కిలో బియ్యం రూ.10 నుంచి రూ.13 వరకు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరా శాఖకు అప్పగించినట్లు తెలిపారు.

34 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details