కన్న కొడుకు కనిపించకుండా పోయాడని... పోలీస్ స్టేషన్కు వెళ్తే... పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హైదరాబాద్ ఉప్పల్ చిలకనగర్కు చెందిన బొంత యాదయ్య... తన కొడుకు సాయికిరణ్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి... వెళ్లిన తమ కొడుకు ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతని స్నేహితులు, తెలిసిన వారిని అడిగిన ప్రయోజనం లేకపోవడం వల్ల ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.