తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లిం సోదరులకు కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ఉప్పల్‌ ఎమ్మెల్యే

రంజాన్​ను పురస్కరించుకుని.. ఉప్పల్​లో ఎమ్మెల్యే బేతి సుభాష్​ రెడ్డి ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని వారికి సూచించారు.

Ramadan gifts to Muslims
Ramadan gifts to Muslims

By

Published : May 2, 2021, 5:05 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల ప్రజల సంక్షేమానికి పాటు పడుతోందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్ ​రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీల పండుగలను విస్మరించాయని ఆయన గుర్తు చేశారు.

కార్పొరేటర్‌ బండారు శ్రీవాణితో కలిసి.. రామంతాపూర్‌, హబ్సీగూడ డివిజన్‌ పరిధిలోని మసీదులలో ముస్లిం సోదరులకు రంజాన్‌ కానుకలను అందజేశారు. కొవిడ్ నియమాలను పాటిస్తూ వేడుకలను జరుపుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు: బాల్క సుమన్​

ABOUT THE AUTHOR

...view details