Uppal Bridge Issue in Hyderabad: భాగ్యనగరం నుంచి యాదాద్రి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రారంభించాయి. దీనిలో భాగంగా ఉప్పల్రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్లు ఫ్లైఓవర్(Uppal FlyOver) నిర్మించాలి. దీనికోసం ఆ మార్గంలో నిర్మించిన పిల్లర్లు సంవత్సరాలుగా అలంకారప్రాయంగా ఉన్నాయి. ఈ కారిడార్‌ను రూ.600 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లు ఆహ్వానించింది.
Uppal Flyover Bridge Works Delay Reason: టెండర్లు ప్రక్రియలో గాయత్రి సంస్థ సుమారు 25 శాతం తక్కువ మొత్తానికి దక్కించుకుంది. నిబంధనల ప్రకారం 2020 జులైలో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉండగా మధ్యలో గుత్తేదారు సంస్థ దివాలా తీసిందీ. దీంతో ప్రయాణికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలే ఇరుగ్గా ఉండే ఈ రహదారిపై పిల్లర్లు మాత్రమే నిర్మించి వదిలేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు ఆసక్తి చూపలేదు. తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకొస్తున్నారు. వర్షాలు కురిస్తే చేసిన పనులు మళ్లీ మొదటికి వస్తున్నాయి.
Uppal Skywalk in Hyderabad : ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం.. ప్రత్యేకతలివీ..
Uppal Elevated Corridor Latest News : హైదరాబాద్ నగరానికి చెందిన రాజ్‌కుమార్ సమాచార హక్కు చట్టం(Right to Information Act) ద్వారా దరఖాస్తు చేయడంతో జాతీయ రహదారుల విభాగం సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకి వచ్చింది. ఇప్పటివరకు కేవలం 42.50 శాతం మాత్రమే పనులు పూర్తి అయినట్లు అధికారులు సమాధానమిచ్చారు. గుత్తేదారు సంస్థ ఆర్థిక సమస్యలతో పాటు ఆ మార్గంలో ఉన్న ఆధ్యాత్మిక నిర్మాణాల తొలగింపు వ్యవహారాల వల్ల కొలిక్కి రాలేదని పేర్కొన్నారు.