తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC QR CODE: టీఎస్​ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులు.. ప్రయాణికులకు సులభంగా లావాదేవీలు

ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా నగదు రహిత చెల్లింపులే జరుగుతున్నాయి. జేబులో డబ్బులు లేకపోయినా ఫోన్‌తో క్యూఆర్​ కోడ్‌స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈమధ్యనే టీఎస్​ఆర్టీసీ ఆ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రయాణికులకు, సిబ్బందికి ఉపయోగకరంగా మారింది.

UPI and QR payments at reservation‌ counters in tsrtc bustnads
టీఎస్​ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులు

By

Published : Oct 31, 2021, 4:43 AM IST

Updated : Oct 31, 2021, 6:26 AM IST

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ. నిత్యం వేలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. చాలాకాలంగా బస్‌పాస్‌లు, టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద నగదు లావాదేవీల సమస్య ఉంటోంది. దీంతో టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఆ అంశంపై చర్చించారు. ఆర్టీసీ బస్టాండ్లు, బస్‌పాస్, రిజర్వేషన్ కౌంటర్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చారు.

గత వారం నుంచి వాటిని అమలు చేస్తున్నారు. తొలుత జూబ్లీ బస్ స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్, కొరియర్, పార్శిల్ కౌంటర్లతో పాటు, రేతిఫైల్‌ బస్‌పాస్ కౌంటర్లలో వాటిని ప్రవేశపెట్టారు. క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రావడం వల్ల చిల్లర సమస్య చాలా వరకు తగ్గిపోయిందని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ప్రయాణికులకూ చెల్లింపులు సులభతరంగా మారాయని అంటున్నారు.

రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా క్యూఆర్​ కోడ్‌తో ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. ఇదే ఆలోచన ప్రయాణికుల నుంచీ వ్యక్తమవుతోంది.


పూర్తిస్థాయిలో అమలుకు యాజమాన్యం చర్యలు

జేబీఎస్, రేతిఫైల్ బస్ పాస్ కౌంటర్లకు మంచి ఆధరణ లభించడంతో క్యూఆర్ కోడ్​ను ఎంజీబీఎస్ బస్టాండ్​లో, కొరియర్ పార్శిల్ కౌంటర్​లో ప్రవేశపెట్టారు. జేబీఎస్ రిజర్వేషన్ కౌంటర్​లో ప్రతిరోజూ సుమారు 50 నుంచి 60 వరకు లావాదేవీలు జరుగుతాయని.. వాటిలో సుమారు 15 నుంచి 20 వరకు క్యూఆర్ కోడ్​ ద్వారానే లావాదేవీలు వస్తున్నాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక బస్​పాస్ కౌంటర్లలో ప్రతి నిత్యం సుమారు 150కి పైగా లావాదేవీలు జరుగుతున్నాయని.. అందులో సుమారు 40 వరకు క్యూఆర్​ కోడ్ ద్వారానే జరుగుతున్నాయంటున్నారు. క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రావడం వల్ల చిల్లర సమస్య కూడా చాలా వరకు తగ్గిపోయిందని బస్ స్టేషన్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలి కాలంలో చాలామంది నగదు రహిత లావాదేవీలపై ఆధారపడుతున్నారు. ఫోన్ పట్టు.. క్యూఆర్ కోడ్ కొట్టు అన్నచందంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంటుంది. ఐదు రూపాయలకు కూడా ప్రజలు క్యూఆర్ కోడ్​నే వినియోగిస్తున్నారని అని చెబుతోంది. అలాంటిది వేల సంఖ్యలో ప్రయాణించే బస్టాండ్లలో క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల డబ్బులను జేబులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్టాళ్లలో ఇప్పటికే క్యూఆర్ కోడ్​తోనే నగదు చెల్లింపులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, బస్​పాస్ కౌంటర్లలో క్యూఆర్​ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు చాలా సౌకర్యంగా ఉందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సేవలు విస్తరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇక నుంచి బస్టాండ్​లలో యూపీఐ, క్యూఆర్​ కోడ్​లతో నగదు చెల్లింపు అమలు

Last Updated : Oct 31, 2021, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details