హీరా గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్ కస్టడీ నేటితో ముగియనుంది. తనపై ఉన్న కేసులకు సంబధించి వీలైనంత సమాచారం రాబట్టేందుకు సీసీఎస్ పోలీసులు యత్నిస్తున్నారు.
బయటపడ్డ మోసాలు..పోలీసులు జరిపిన సోదాల్లో లభించిన పత్రాలు, హార్డ్ డిస్క్‌ల ద్వారా పలు మోసాలు బయటపడ్డాయి. సుమారు లక్షన్నర మంది మదుపర్ల నుంచి 6 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన నౌహీరా షేక్.... వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసింది. నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, దుబాయి నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు సీసీఎస్ దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పలు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు... నగదు ఎవరి దగ్గర నుంచి వచ్చింది... అది ఏమైంది..? అనే అంశాలపై కూపీ లాగుతున్నారు.
రంగంలోకి ఈడీ..హీరా గ్రూప్స్ మోసాలపై విచారణ చేపట్టాల్సిందిగా సీసీఎస్ పోలీసులు లేఖ రాయగా... ఈడీ, ఆదాయపన్ను సంస్థలు కూడా దృష్టి సారిస్తున్నాయి. దర్యాప్తు పూర్తికాకుంటే నౌహీరా కస్టడీని మరింత పొడిగించాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది.