TS Rains: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్నటి ఆవర్తనం ఈరోజు కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోందని సంచాలకులు తెలిపారు. ఇది సగటు సముద్ర మట్టానికి నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉందని వివరించారు.
TS Rains: రెయిన్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..! - వర్ష సమాచారం
TS Rains: రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే విధంగా ఇవాళ చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది.
TS Rains