విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో 26వ పోస్టు గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యుఎన్‌క్యూబీఈ సీఈఓ డాక్టర్ షాలిని లాల్ చేతుల మీదగా బంగారు పథకాలను అందజేశారు. ప్రస్తుత తరంలో సాంకేతికత అభివృద్ధికి ఊతమిస్తోందని ఆమె తెలిపారు.
సాంకేతికత అభివృద్ధికి ఊతం: యుఎన్‌క్యూబీఈ సీఈఓ - Vijnana Jyothi Institute of Management College Graduation Ceremonies
జీవితాన్ని, వృత్తిని మార్గనిర్దేశం చేయగల విషయాలు కళాశాలలో ఎంతో తేలికగా అనిపించినా... నిజ జీవితంలో క్లిష్టతరమవుతాయని యుఎన్‌క్యూబీఈ సీఈఓ డాక్టర్ షాలిని లాల్ అన్నారు. విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాల స్నాతకోత్సవాలకు ఆమె ముఖ్యఅథితిగా హాజరయ్యారు.
సాంకేతికత అభివృద్ధికి ఊతం: యుఎన్‌క్యూబీఈ సీఈఓ
టైటాన్ వాచెస్ కంపెనీలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం స్నాతకోత్సవానికి విచ్చేసిన విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు.
ఇదీ చదవండి:అసలు ఎవరీ 'సారంగ దరియా'!