Offer on Super Saver Card in Hyderabad Metro: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. దీంతో హైదరాబాద్‌లో నివసించే చాలా మంది నగర వాసులు తమ స్వస్థలాలకు, బంధువుల ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో పల్లెలన్నీ పండగ శోభను సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే మరికొందరు సంక్రాంతి సెలవులను భాగ్యనగరంలో గడిపేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు వివిధ సంస్థలు, కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కూడా నగరంలో నివసించే వారితో పాటు హాలీడే ట్రిప్ కోసం వచ్చే వారికి గుడ్ న్యూస్ అందించింది. ఇంతకీ ఏంటి ఆ శుభవార్త అని అనుకుంటున్నారా? అయితే ఆ వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..
Hyderabad Metro Green Line Full Details : హైదరాబాద్ మెట్రో గ్రీన్ లైన్.. ఈ విషయాలు తెలుసా..?
ఒకప్పుడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని కారణంగా ఆఫీసులకు వెళ్లే వాళ్లు, పాఠశాలలకు వెళ్లేవారు ట్రాఫిక్‌తో నానా రకాల ఇబ్బందులు పడేవారు. ఎంత తొందరగా ఇంటి నుంచి బయటికి వెళ్లినా.. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వచ్చేది. అయితే మెట్రో రైళ్లు వచ్చాక ఈ ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకునే అవసరం లేకపోవడం.. టైమ్ కూడా సేవ్ అవ్వడంతో నగరంలో మెట్రో రైళ్లకు ఆదరణ పెరిగింది. దాంతో క్రమక్రమంగా ఈ రైళ్లల్లో కూడా రద్దీ పెరిగింది.
ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అనేక సౌకర్యాలను అందిస్తుంది హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్. అలాగే ప్రత్యేక సందర్భాలు, పండగల సమయంలో మెట్రో ప్రయాణికులకు అధికారులు రాయితీలు, ఇతర ఆఫర్లను అందిస్తున్నారు. గతంలో క్రికెట్ మ్యాచ్‌లు, న్యూ ఇయర్ సందర్భంగా రైళ్ల వేళలు పెంచి అదనపు రైళ్లను కేటాయించిన మెట్రో సంస్థ... తాజాగా, సంక్రాంతి పండగ సందర్భంగా మరో బంపరాఫర్ ప్రకటించింది. పండగ సందర్భంగా హైదరాబాద్‌లో పలు ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది.