తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం - కూకట్​పల్లి కేపీహెచ్​పీ కాలనీలోని రోడ్ నెంబర్ వన్​లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి

కూకట్​పల్లి కేపీహెచ్​పీ కాలనీలోని రోడ్ నెంబర్ వన్​లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

dead body
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Jan 13, 2020, 2:22 PM IST

Updated : Jan 13, 2020, 2:42 PM IST

కూకట్​పల్లి కేపీహెచ్​పీ కాలనీలోని రోడ్ నెంబర్ వన్​ పక్కనున్న సెల్లార్ గోతిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడం వల్ల వ్యక్తి మృతి చెంది సుమారు వారం రోజులు దాటి ఉంటుందని పోలీసులు విస్తున్నారు.

ఈ వ్యక్తిని ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా, ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి గోతిలో పడి మృతి చెందాడా లేదా అతనే కావాలని అందులో దూకి చనిపోయాడా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అయితే తప్ప ఏమీ చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భవన నిర్మాణం కోసం సెల్లార్ గోతిని తవ్వి, భవనం నిర్మించకుండా వదిలివేయటం వల్ల ఆ గోతిలో నీరు చేరింది. ప్రస్తుతం ఆ గోతి చెరువును తలపించేలా ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల సన్నద్ధతపై ఎస్‌ఈసీ సమీక్ష

Last Updated : Jan 13, 2020, 2:42 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details