తెలంగాణ

telangana

ETV Bharat / state

HCU:117 కోర్సుల్లో ప్రవేశాలకు హెచ్​సీయూ నోటిఫికేషన్​ - విద్యాసమాచారం

117 కోర్సుల్లో 2,328 సీట్ల భర్తీకి హెచ్​సీయూ నోటిఫికేషన్​ విడుదల చేసింది. జులై 20 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఇచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్​లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని విశ్వవిద్యాలయం అధికారులు స్పష్టం చేశారు.

hyderabad university
hyderabad university

By

Published : Jun 20, 2021, 3:52 PM IST

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 2021-2022 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 117 కోర్సుల్లో 2,328 సీట్ల భర్తీకి ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 20 వరకు అవకాశం ఇచ్చారు.

17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్‌డీ కోర్సులకు అడ్మిషన్లు జరుపుతున్నట్లు వర్సిటీ పేర్కొంది. ఈ ఏడాది కొత్తగా ఎంటెక్‌లో మోడలింగ్ అండ్ సిమ్యులేషన్, ఎంపీఏ మ్యూజిక్, పబ్లిషింగ్‌లో సర్టిఫికేట్ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది.

దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిమ్‌సెట్ మార్కుల ఆధారంగా ఎంసీఏ, గేట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంటెక్, జేఈఈ పరీక్ష ఆధారంగా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అడ్మిషన్లు జరుగుతాయని హెచ్‌సీయూ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్​సైట్​లో చూడాలని పేర్కొంది.

ఇవీచూడండి:SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్​ అవసరమా ?

ABOUT THE AUTHOR

...view details