బీసీలు రాజ్యాధికారం సాధించినప్పుడే అన్ని సమస్యల పరిష్కారమవుతాయని పలువురు బీసీ నేతలు అన్నారు. చట్టసభల్లో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్‌లు కేంద్రం అమలు చేయాలని ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈటల పేర్కొన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన అఖిల భారత ఓబీసీ మహాసభకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలు హాజరయ్యారు. దేశ జనాభాలో అధికంగా ఉన్న తాము రాజ్యధికారం సాధించకపోవడానికి కారణం ఐక్యత లేకపోవడమేనని మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ అన్నారు. ప్రజలు చైతన్యం కానంత వరకు అభివృద్ధి జరుగదని చెప్పారు.
ఐక్యమత్యంతోనే రాజ్యధికారం సాధ్యం
హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన అఖిల భారత ఓబీసీ మహాసభలో రాజ్యధికారంతోనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు బీసీ నేతలన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ప్రముఖ నేతలు, పలువురు మంత్రులు హాజరయ్యారు.
ఐక్యమత్యంతోనే రాజ్యధికారం సాధ్యం