తెలంగాణ

telangana

ETV Bharat / state

English Teachers Training : ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం - ఉపాధ్యాయులకు యూస్​ రాయబార కార్యాలయం శిక్షణ

English Teachers Training: రాష్ట్రంలోని ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు బోధనపై మరింత పట్టు పెంచేందుకు అమెరికా రాయబార కార్యాలయం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. దిల్లీలో నిన్న ప్రారంభమైన శిక్షణ కార్యక్రమానికి మూడు రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మందిని ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి దాదాపు 40 మంది ఉన్నారు.

Teachers Training
Teachers Training

By

Published : Feb 10, 2022, 5:39 PM IST

Updated : Feb 10, 2022, 6:16 PM IST

English Teachers Training : ఆంగ్లమాద్యమం బోధించే ఉపాధ్యాయులకు బోధనలో మరింత నైపుణ్యం పెంచేందుకు యూఎస్​ రాయబార కార్యాలయం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బంగ్లా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో.. ప్రముఖ ఆంగ్ల భాష శిక్షణ సంస్థ టెసోల్ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల నుంచి సుమారు వంద మందిని ఎంపిక చేయగా.. వారిలో రాష్ట్రం నుంచి సుమారు 40మంది ఉన్నారు. ఈ కోర్స్​ సర్టిఫికెట్ ప్రోగ్రాం... విద్యార్థులకు ఆంగ్ల భాష ఎలా బోధించాలో మెళకువలు నేర్పిస్తారు.

విద్యార్థులకు అవసరమైన సునిశిత పరిశీలన, అధ్యయనం, నూతన నైపుణ్యాంశాల వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు.. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని మిగతా ఉపాధ్యాయులకు నేర్పిస్తారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో దిల్లీలో విజయవంతమైందని యూఎస్ ఎంబసీ తెలిపింది. దిల్లీలో 200 మంది శిక్షణ పూర్తి చేసుకొని.. సుమారు 10వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా రాయబార కార్యాలయాలు, కాన్యులేట్ల పరిధిలోని ప్రాంతీయ ఆంగ్ల భాష కార్యాలయాల ద్వారా... ఆంగ్ల ఉపాధ్యాయుల శిక్షణ కోసం అమెరికా ప్రభుత్వం ఏటా ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది.

ఇదీ చూడండి :ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు

Last Updated : Feb 10, 2022, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details