తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy on Tourism: 'పర్యాటకాన్ని మళ్లీ పుంజుకునేలా చేసే బాధ్యత మనందరిది' - Indian tourism news

Kishan Reddy on Tourism: మళ్లీ పర్యాటక రంగాన్ని పుంజుకునేలా చేసే బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టూరిజం మీద ఆధాపడిన వ్యాపారులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.

Kishan Reddy
Kishan Reddy

By

Published : Dec 26, 2021, 7:51 PM IST

'పర్యాటకాన్ని మళ్లీ పుంజుకునేలా చేసే బాధ్యత మనందరిది'

Kishan Reddy on Tourism: ప్రపంచ దేశాలను తలపించే అద్భుతమైన చారిత్రక, పర్యాటక కట్టడాలు మన దేశంలో ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మనకు స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను మనమే ప్రమోట్ చేసి ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ప్లాజా హోటల్‌లో కొవిడ్ వల్ల దెబ్బతిన్న టూరిజం గైడ్లు, ఆపరేటర్లకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లోన్ గ్యారెంటీ స్కీం కింద అందజేసే రుణాలకు సంబంధించిన చెక్కులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహుకరించారు.

కరోనా మహమ్మారితో విద్య, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాక్సినేషన్, మాస్కు ధరించటం వంటి అన్ని రకాల జాగ్రత్తలతో పర్యాటకాన్ని మళ్లీ పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కిషన్ రెడ్డి సూచించారు. హెరిటేజ్ సర్క్యూట్ కింద సెవెన్ టూంబ్స్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర నిర్ణయించిందన్నారు. దీనిపై ఉన్న చిక్కుల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

రైల్వే, టూరిజం శాఖ సంయుక్తంగా 3,600 కోచ్‌లను ప్రైవేటు రంగానికి ఇచ్చి వారికి అనుకూలంగా నడుపుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. త్వరలో వరంగల్ వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో ఆలయ శిల్పకళా నైపుణ్యంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. భూదాన్ పోచంపల్లిలో జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని కిషన్ రెడ్డి ప్రకటించారు.

తెలుగు ఉభయ రాష్ట్రాల్లో యునెస్కో వారసత్వ కట్టడంగా రామప్పకు గుర్తింపు రావటం... భూదాన్ పోచంపల్లి ప్రపంచ పర్యాటక గ్రామంగా నిలవడం మనకు గర్వకారణం. హెరిటేజ్ సర్క్యూట్ కింద సెవెన్ టూంబ్స్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనిపై ఉన్న చిక్కుల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. రైల్వే, టూరిజం శాఖ సంయుక్తంగా 3,600 కోచ్‌లను ప్రైవేట్ సెక్టార్‌కు ఇచ్చి వారికి అనుకూలంగా రన్ చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాం. నవోదయ పాఠశాలల్లో టూరిస్ట్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో విద్యార్థులతో కూడిన టూరిస్ట్ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నాం.

- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details