తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రమంత్రులారా వెల్​కం టూ హైదరాబాద్... పైసలు తీసుకొనిరండి' - కేంద్రంపై కేటీఆర్ విమర్శలు

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... ఇందిరాగాంధీ చౌరస్తాలో రోడ్​షో నిర్వహించారు. బల్దియా అభివృద్ధికి తెరాస కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రశాంత హైదరాబాద్​ కోసం కారు గుర్తుకే ఓటేయాలని సూచించారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'కేంద్రమంత్రులరా వెల్​కం టూ హైదరాబాద్... పైసలు తీసుకొనిరండి'
'కేంద్రమంత్రులరా వెల్​కం టూ హైదరాబాద్... పైసలు తీసుకొనిరండి'

By

Published : Nov 26, 2020, 6:25 PM IST

Updated : Nov 26, 2020, 9:14 PM IST

"కేంద్రానికి రూపాయి కడితే ఆఠాణా ఇస్తోంది. మరి మన ఆఠాణా ఎక్కడపోయింది. ఉత్తర్​ప్రదేశ్​, బిహార్, గుజరాత్​కు పోయింది. వరద బాధితులకు రూ. 10వేలు ఇచ్చింది మనమే... రానివాళ్లకు డిసెంబర్​ 4 తర్వాత ఇచ్చేది మనమే. 10 నుంచి 12 మంది కేంద్ర మంత్రులు హైదరాబాద్​కు వస్తుర్రంటా. రేపోమాపో మోదీ కూడా వస్తడంటా. ఇక మిగిలింది ట్రంప్​ ఒక్కడే. ఆయనను కూడా తీసుకొస్తారేమో! వరదలు వచ్చినయ్... పైసలు ఇవ్వమంటే ఉలుకులేదు పలుకులేదు. కేంద్ర మంత్రులరా వెల్​కం​ టూ హైదరాబాద్​. వచ్చేటపుడు పైసలు తీసుకొని రండి. లేకపోతే ప్రజలు రానివ్వరు. జన్​ధన్ ఖాతా తెరిస్తే ధన్​ధన్ పైసలు వేస్తామన్నారు... ఎక్కడపోయినవి? కేంద్రం నుంచి వచ్చింది హళ్లికి హళ్లి... సున్నకి సున్న. వాళ్లకి తెలిసింది ఒకటే హిందూ- ముస్లిం. ఈ మధ్యలో వచ్చిన ఒకాయాన పోరగాళ్లను రెచ్చగొడుతుండు. భాజపా నాయకులు అంటున్నరు.. ఈ ఎన్నికలు బిన్​లాడెన్​కు, దేశభక్తులకు జరిగే ఎన్నికలంటా! బిన్​లాడెన్ ఎవడు? మనకి కావాల్సింది ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తయి. మీరేం పరేషాన్ కాకండి లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రెడీగా ఉన్నయి. ఇచ్చే జిమ్మెదారి మాది. గల్లీ పార్టీ కావాల్న... దిల్లీ పార్టీ కావాల్న మీరే నిర్ణయించుకోండి."

--- రోడ్​షోలో కేటీఆర్

ఇదీ చూడండి:కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి: కేటీఆర్​

Last Updated : Nov 26, 2020, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details