Rajnath Singh visits Prabhas house: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. ప్రభాస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్‌నాథ్‌సింగ్ వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? ఏయే చికిత్సలు అందించారో ఎంపీ లక్ష్మణ్ రాజ్‌నాథ్‌కు వివరించారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు.
అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌కు.. రాష్ట్ర భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాజ్‌నాథ్‌సింగ్ నేరుగా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి నగరానికి వస్తున్న అమిత్‌షా.. రేపు ప్రభాస్‌ను పరామర్శించనున్నారు.